HomeTelugu Trending'గీతాంజలి మళ్లీ వచ్చింది' ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ విడుదల

‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ విడుదల

geethanjali malli vachindi
తెలుగు హీరోయిన్ అంజలి ప్రధాన పాత్రలో న‌టిస్తున్న తాజా చిత్రం ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. 2014లో వచ్చిన ‘గీతాంజలి’ సినిమాకు సీక్వెల్‌ మూవీ. శ్రీనివాస్‌ రెడ్డి హీరోగా నటిస్తునన ఈ సినిమాలో సునీల్‌, సత్యం రాజేశ్‌, షకలక శంకర్‌, అలీ త‌దిత‌రులు కీలక పాత్రల్లో న‌టిస్తున్నారు.

అంజలి 50వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి వెంక‌ట్ క‌థ, స్రీన్ ప్లేను అందిస్తుండ‌గా.. శివతుర్లపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటి వరకూ ఈ సినిమా నుండి విడుదలైన అంజ‌లి ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌తో పాటు హీరో సునీల్ ఫ‌స్ట్ లుక్‌ల‌ను విడుద‌ల చేయ‌గా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది.

తాజాగా ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఈ పోస్ట‌ర్‌లో పాడుబడిన బిల్డింగ్‌లో అంజ‌లి, శ్రీనివాస్‌ రెడ్డి, సత్యం రాజేశ్‌, షకలక శంకర్‌, అలీ, సునీల్ ఉండ‌గా.. పైకి దేనినో సీరియస్‌గా చూస్తున్న‌ట్లు ఉంది.

ఎంవీవీ సినిమాస్‌ బ్యానర్‌తో కలిసి కోన ఫిలిం కార్పొరేషన్‌ బ్యానర్‌పై కోన వెంకట్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తున్నాడు. తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, హిందీ, క‌న్న‌డ భాష‌ల్లో గ్రాండ్‌గా విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ వెల్ల‌డించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu