HomeTelugu Trendingక్రిస్మస్‌కి పోటీ పడనున్న'నాని- వరుణ్‌ తేజ్‌'

క్రిస్మస్‌కి పోటీ పడనున్న’నాని- వరుణ్‌ తేజ్‌’

Ghani and shyam singha roy

కరోనా క్రైసిస్ కష్టకాలంలో నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటించిన సినిమాలు బ్యాక్ టూ బ్యాక్ ఓటీటీలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా నాని నటించిన చిత్రం `శ్యామ్ సింగరాయ్’ డిసెంబర్ 24న థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ లో బిజీ అయ్యారు మూవీ యూనిట్‌. అప్పటికే పాన్ ఇండియా చిత్రం `పుష్ప -ది రైజ్` కూడా రిలీజ్ అయిపోతుంది. పెద్ద సినిమాతో వారం గ్యాప్ ఉంది కాబట్టి పోటీ లేకుండా నేచరల్ స్టార్ తన సినిమా రిలీజ్ ని అలా ప్లాన్ చేసుకున్నాడు. కొత్త సినిమాలు కూడా రిలీజ్ లు లేకపోవడంతో థియేటర్ల సమస్య ఉండదని భావించారు. సరిగ్గా క్రిస్మస్ సెలవులు కూడా కలిసొస్తాయని ప్లాన్ చేసుకున్నారు. అయితే అనూహ్యంగా క్రిస్మస్ బరిలోకి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ దిగాడు.

వరుణ్‌ తేజ్‌ హీరోగా నటిస్తోన్న `గని` చిత్రాన్ని కూడా డిసెంబర్ 24న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఎప్పటి నుంచో ఈ సినిమా కూడా వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఆలస్యం అమృతం విషం అన్న చందంగా సరిగ్గా నాని `శ్యామ్ సింగరాయ్ ` కిపోటీగానే `గని`ని కూడా దించుతున్నారు. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ రెండు సినిమాల మధ్యా ఫైట్ తప్పదని అర్థమవుతోంది. ఇద్దరి మధ్య గట్టి పోటీ ఉంటుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఓటీటీలో రిలీజ్ అయినా నాని గత చిత్రాలు రెండూ పెద్దగా సక్సెస్ అవ్వలేదు. దీంతో థియేటర్ రిలీజ్ పైనే ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. ఇక వరుణ్ కూడా `గని`పై భానారీగానే ఆశలు పెట్టుకున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu