HomeTelugu Trending'గని' రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

‘గని’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Ghani release date
మెగా ప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌ బాక్సర్‌గా నటిస్తున్న చిత్రం ‘గని’. నూతన దర్శకుడు కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతుంది. దేశంలో బాక్సర్లు ఎదుర్కొంటున్న సమస్యలను చూపిస్తూనే ఓ సందేశాన్ని ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. వరుణ్‌తేజ్‌ పుట్టినరోజు సందర్భంగా జనవరి 19వ తేదీన ఈ సినిమా టైటిల్‌ పోస్టర్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. బాక్సింగ్‌ రింగ్‌లో పంచులు కొడుతున్న వరుణ్‌ లుక్‌ అభిమానులను ఎంతగానో అలరించింది. తాజాగా ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ ఎప్పుడన్న విషయాన్ని చిత్రయూనిట్‌ వెల్లడించింది.

జూలై 30వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతున్నట్లు ప్రకటించింది. ఈ చిత్రంలో వరుణ్‌ తేజ్‌ తండ్రిగా ఉపేంద్ర, కోచ్‌గా సునీల్‌ శెట్టి, విలన్‌గా జగపతిబాబు కనిపించనున్నారు. బాలీవుడ్‌ దర్శకనటుడు మహేష్‌ మంజ్రేకర్‌ కూతురు సయూ మంజ్రేకర్‌ హీరోయిన్‌గా టాలీవుడ్‌లో అడుగు పెడుతోంది. నవీన్‌ చంద్ర ఓ ముఖ్యపాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. తమన్‌ సంగీతం అందిస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu