HomeTelugu Trending'గని' రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

‘గని’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Ghani new release date anno
మెగా ప్రీన్స్‌ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి డైరెక్షన్‌లో రూపుదిద్దుకున్న చిత్రం ‘గని’. ఎట్టకేలకు ఈసినిమా విడుదల తేదీను చిత్రబృందం ఇవాళ నిర్ధారించింది. ‘గని’ ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్టు ప్రకటించింది. మూడేళ్ల పాటు పడిన కష్టానికి ప్రతిఫలం అందుకునే సమయం వచ్చిందని, తప్పకుండా ప్రేక్షకుల ఆదరాభిమానాలు అందుకుంటామన్న నమ్మకం ఉందని హీరో వరుణ్ తేజ్ పేర్కొన్నారు.

ఫిబ్రవరి 25న థియేటర్లలో కలుసుకుందాం అంటూ ట్వీట్ చేశారు. అల్లు బాబీ, సిద్ధు ముద్దా సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తుంది. సునీల్ శెట్టి, జగపతిబాబు, ఉపేంద్ర, నవీన్ చంద్ర కీలకపాత్రలు పోషించారు. తమన్ సంగీతం అందించారు.

సర్కారువారి పాట: కళావతి సాంగ్‌ విడుదల

Recent Articles English

Gallery

Recent Articles Telugu