HomeTelugu Trending'గని' టీజర్‌

‘గని’ టీజర్‌

ghani teaser
మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘గని’. కిరణ్‌ కొర్రపాటి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా బాక్సింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్‌లుక్‌, టైటిల్‌ సాంగ్‌ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అలాగే గని ప్రపంచం ఇదేనంటూ ప్రత్యేకంగా విడుదల చేసిన వీడియోకు కూడా మంచి స్పందన వచ్చింది.

ఈ నేపథ్యంలో తాజాగా మూవీ టీజర్‌ను విడుదల మేకర్స్‌. కిక్‌ బాక్సింగ్‌ నేపథ్యంలో వస్తుండగా.. రామ్‌ చరణ్‌ వాయిస్‌ ఓవర్‌తో టీజర్‌ మొదలైంది. మధ్యలో ‘ఆట ఆడినా, ఓడినా రికార్డ్స్‌లో ఉంటావ్‌. కానీ గెలిస్తే మాత్రం చరిత్రలో ఉంటావ్‌’అంటూ చెప్పిన డైలాగ్‌ కేక పెట్టించేలా ఉంది. ఇక వరుణ్‌ సరసన బాలీవుడ్‌ బ్యూటీ సయీ మంజ్రేకర్‌ హీరోయిన్‌గా నటించింది. అల్లు అరవింద్‌ సమర్పణలో సిద్ధు ముద్ద, అల్లు బాబీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu