HomeTelugu NewsUnstoppable 4: బాలయ్య సందడి షురూ.. కానీ ట్విస్ట్ ఏమిటంటే?

Unstoppable 4: బాలయ్య సందడి షురూ.. కానీ ట్విస్ట్ ఏమిటంటే?

Unstoppable 4

Unstoppable 4: నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తున్న సూపర్‌ హిట్‌ టాక్‌ షో ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే’. ఈ షో ఆయనకు బాగా కలిసి వచ్చింది అనే చెప్పాలి. ఇప్పటికే 3 సీజన్లు పూర్తి చేసుకుంది ఈ షో. ఇప్పటి వరకూ పలువురు స్టార్‌ సెలబ్రెటీలు ఈ షోలో సందడి చేశారు.

ఇప్పటి వరకూ సినిమాలు మాత్రమే చేసిన బాలయ్య ఈ షోలో ఓ రేంజ్‌లో సందడి చేశాడు. వచ్చిన అతిధిలతో చిన్నపిల్లడిలా అల్లరి చేస్తూ.. మంచి ఫన్‌ క్రియేట్‌ చేశాడు. దీంతో ఇప్పటి వరకూ వచ్చిన 3 సీజన్‌లు బాగా హిట్‌ అయ్యాయి.

తాజాగా ఈ బిగ్గెస్ట్ టాక్ షోకి మరో సీజన్ ఉండబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చేసింది. అయితే ఈసారి ఒక ట్విస్ట్ తో మీ ముందుకు వస్తోంది అంటూ ఈ టాక్ షో స్ట్రీమింగ్ చేసిన ఆహా వీడియో సంస్థ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అయితే ఆ ట్విస్ట్ ఏమిటి? ఎప్పటి నుంచి ఈ షో స్ట్రీమింగ్ కాబోతోంది అనే విషయం మీద క్లారిటీ లేదు.

త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. కాగా ప్రస్తుతం రాజకీయాల్లో బిజీ బిజీగా గడుపుతున్నారు. బాలకృష్ణ -బాబీ డైరెక్షన్‌లో తన 109వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి వీరమాస్ టైటిల్‌ ఫిక్స్‌ చేయనున్నారు. దీని తరువాత బోయపాటితో చేయనున్నట్లు తెలుస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu