HomeTelugu Trending'గాడ్‌ ఫాదర్‌' మూవీ టీజర్‌

‘గాడ్‌ ఫాదర్‌’ మూవీ టీజర్‌

God Father movieTeaser

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం గాడ్‌ ఫాదర్‌. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ మూవీ టీజర్‌ విడుదలైంది. ’20 ఏళ్లు ఎక్కడికెళ్లాడో ఎవరికీ తెలీదు. సడన్‌గా తిరగొచ్చిన ఆరేళ్లలో జనాలలో మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు’ అన్న డైలాగ్‌తో టీజర్‌ మొదలైంది. ఇక్కడికీ ఎవరు వచ్చినా, రాకపోయినా నేను పట్టించుకోను. కానీ అతడు మాత్రం రాకూడదు అంటూ నయనతారను చూపించారు. వెయిట్‌ ఫర్‌ మై కమాండ్‌ బ్రదర్‌ అంటూ సల్మాన్‌కు గైడెన్స్‌ ఇస్తున్నాడు మెగాస్టార్‌. చివర్లో సల్మాన్‌, చిరు ఇద్దరూ కలిసి ఫైట్‌ సీన్‌లో కనిపించారు. ఈ సీన్‌కు థియేటర్లలో విజిల్స్‌ పడటం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ సినిమా అక్టోబర్‌ 5న విడుదల కానున్నట్లు ప్రకటించారు. ఇక మోహన్‌ రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమాను కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్‌బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. సల్మాన్‌ ఖాన్, నయనతార, పూరి జగన్నాథ్, సత్యదేవ్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu