HomeTelugu Trendingపూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు

పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు

Poonam Kaur
పూనమ్ కౌర్ తరచుగా సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు వైరల్ అవుతుంటాయి. నటిగా కంటే వివాదాలతో పూనమ్ కౌర్ ఎక్కువగా ఫేమస్ అయ్యారు. ఈమె పోస్టులు ప్రధానంగా ఇద్దరు ప్రముఖులను టార్గెట్ చేసినట్లు ఉంటాయి. తాజాగా ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేసిన స్టోరీ వైరల్ అవుతోంది.

గురుపూర్ణిమ సందర్భంగా ఇన్‌స్టాలో పూనమ్‌ ఓ స్టోరీని షేర్ చేసింది. అదేమిటంటే.. ‘మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రతి టామ్, డిక్ అండ్ హారీని.. గురువు అని పిలవద్దు. నీతులు చెప్పి స్టేజ్ మీద జీవితాలతో ఆడుకునే వాడు గురువు కాదు. మీకు దారి చూపించేవారు గురువు అవుతారు’ అంటూ పోస్ట్ పెట్టింది.

పూనమ్‌ పోస్టుపై చర్చలు జరుగుతున్నాయి. ఆమె ఎవరి గురించి రాశారు? ఎవరిని టార్గెట్ చేస్తున్నారు? ఎవరికి సలహాలిస్తున్నారు? అంటూ జనాల్లో చర్చ. టాలీవుడ్‌లో ఓ డైరెక్టర్‌ను టార్గెట్ చేసుకుని పూనమ్ విమర్శలు చేసిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu