HomeTelugu Trending‘గోల్డ్‌ మెడల్‌’ టీజర్‌

‘గోల్డ్‌ మెడల్‌’ టీజర్‌

Gold medal teaser
ఉదయ్‌ కుమార్‌, దివ్య శ్రీ జంటగా నటించిన చిత్రం ‘గోల్డ్‌ మెడల్‌’. విభిన్న కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం గురువారం విడుదల చేసింది. గోల్డ్‌ కోటింగ్‌ పేరుతో కొంతమంది వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి బంగారాన్ని ఎత్తుకుపోయారని మనం ఎన్నో సార్లు విన్నాం. ఇప్పుడు అదే తరహా కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు టీజర్‌ చూస్తే అర్థమవుతోంది. ఉదయ్‌ కుమార్‌ నటన ఆసక్తిని రేకేత్తించేలా ఉంది. యూకే క్రియేషన్స్ బ్యానర్ పై ఉదయ్ కుమార్ ఎం ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ఆయనే అందిస్తున్నారు. నవీన్ చంద్ర ఎం ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా… రాజ్ సంగీతం సమకూరుస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu