HomeTelugu Trendingమెగాస్టార్‌ ఫ్యామీలీలో ఆనందం ..తండ్రైన కల్యాణ్‌దేవ్‌

మెగాస్టార్‌ ఫ్యామీలీలో ఆనందం ..తండ్రైన కల్యాణ్‌దేవ్‌

1 25క్రిస్మస్‌ రోజున మెగాస్టార్‌ ఫ్యామీలీలో ఆనందం రెట్టింపైంది. చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ, కల్యాణ్‌దేవ్‌ దంపతులకు పండంటి ఆడశిశువు జన్మించింది. ఈ విషయాన్ని కల్యాణ్‌దేవ్‌ సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. దీంతోపాటు పాప కాలి ముద్ర ఉన్న ఫొటోను షేర్‌ చేశారు. ‘2018 క్రిస్మస్‌ నా జీవితాంతం గుర్తుండి పోతుంది. మాకు ఇవాళ ఉదయం ఆడశిశువు పుట్టింది. మీ అందరికీ సూపర్‌ మెర్రీ క్రిస్మస్‌ శుభాకాంక్షలు’ అని ఆయన పోస్ట్‌ చేశారు.కల్యాణ్‌దేవ్‌ ప్రస్తుతం తన రెండో సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఆయన ‘విజేత’ చిత్రంతో ఈ ఏడాది నటుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సంగతి తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!