HomeTelugu Trendingడబుల్ హిట్ కొట్టిన రాశిఖన్నా

డబుల్ హిట్ కొట్టిన రాశిఖన్నా

6 25
ఒకే నెలలో రెండు భారీ హిట్లు కొట్టేసింది రాశిఖన్నా. రెండు హిట్లు దక్కడం విశేషం. ఊహలు గుసగుసలాడే, సుప్రీమ్, జై లవకుశ వంటి సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా నిలిచిన రాశీఖన్నా ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమా తర్వాత సరైనా హిట్టు లేక.. అవకాశాలు రక హిట్ తప్పనిసరి అనుకున్న సమయంలోనే ఆమెకు రెండు హిట్లు దక్కడం వెరీ లక్కీ.

వెంకీమామ, ప్రతిరోజూ పండగే చిత్రాలు మంచి హిట్‌ సాధించి.. కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్ వద్ద పరుగులు పెడుతున్నాయి. ఈ రెండు సినిమాల్లో రాశిఖన్నాకు ముఖ్యంగా `ప్రతిరోజూ పండగే` సినిమా మంచి గుర్తింపు తెచ్చింది. రాశీఖన్నా ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న `వరల్డ్ ఫేమస్ లవర్` సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా కూడా కచ్చితంగా విజయాన్ని సాధిస్తుందని నమ్ముతోంది. ఈ సినిమాని వచ్చే ఏడాది ఫిబ్రవరి 14 న రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పుడు సాధించిన ఈ రెండు విజయాలతో ఈ ఏడాదిని చాలా గ్రాండ్ గా ముగించింది రాశీఖన్నా. ఈ సక్సెస్ తో తనకు టాలీవుడ్ నుంచి వరుస అవకాశాలు వస్తాయని ఆశిస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu