గోపిచంద్ సినిమాలో ప్రభాస్..?

prabhas

బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రభాస్ ప్రస్తుతం బాహుబలి 2 సినిమా
షూటింగ్ లో బిజీగా గడుపుతున్నాడు. ఈ సినిమా తరువాత ప్రభాస్ యు.వి.క్రియేషన్స్ లో
వరుస చిత్రాలు చేయనున్నాడు. అయితే ఈలోగా ఓ గెస్ట్ రోల్ లో ఆయనను చూపించే
ప్రయత్నాలు జరుగుతున్నాయి. గోపిచంద్, సంపత్ నంది దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.
ఇందులో గోపిచంద్ మొదటిసారిగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. అలానే ఈ సినిమాలో
ఆయన కొత్త లుక్ తో కనిపించనున్నాడు. ఈ సినిమాలో గెస్ట్ రోల్ పాత్ర ఉందట. దీనికోసం
ప్రభాస్ అయితే బావుంటుందని సంపత్ నంది, గోపిచంద్ కు చెప్పారట. గోపిచంద్ అడిగితే
ప్రభాస్ కాదనరు. కానీ ప్రభాస్ ఉన్న బిజీ షెడ్యూల్ లో గెస్ట్ రోల్ లో నటిస్తాడా..? అనే
అనుమానంతో గోపిచంద్ ఇప్పటివరకు ఆయన్ను అడగలేకపోతున్నారు. మరి ప్రభాస్
ఈ సినిమాలో కనిపిస్తాడో.. లేదో.. చూడాలి!

CLICK HERE!! For the aha Latest Updates