HomeTelugu Trendingగోపీచంద్ 'పక్కా కమర్షియల్' రిలీజ్ డేట్ ఫిక్స్!

గోపీచంద్ ‘పక్కా కమర్షియల్’ రిలీజ్ డేట్ ఫిక్స్!

Gopichand quits Teja's project?

వరుస ఫ్లాప్‌లతో నిరాశలో ఉన్న హీరో గోపిచంద్ ఎలాగైనా హిట్ కొట్టాలని పంతంతో ఉన్నాడు. ‘పక్కా కమర్షియల్’ మూవీతో ఆడియన్స్ మెప్పు పొందేందుకు సరికొత్తగా థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అవుతున్నాడు. స్టార్ డైరెక్టర్ మారుతి రూపొందించిన ఈ మూవీ.. ఇప్పటికే రిలీజైన ‘పక్కా కమర్షియల్’ మూవీ టీజర్‌కు ఆడియన్స్ నుంచి అద్భుత రెస్పాన్స్ వచ్చింది. మారుతి ఈ మూవీని డైరెక్ట్ చేస్తుండడంతో ప్రేక్షకులకు భారీ అంచనాలే ఏర్పడ్డాయి. గోపిచంద్ గతంలో ఎన్నడూ లేనంత స్టైలిష్‌గా ఈ మూవీలో కనిపిస్తుండడం అంచనాలను మరింత పెంచేసింది.

గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేక గోపిచంద్ ఫుల్ డిస్పాయింట్‌లో ఉన్నాడు. ‘లౌక్యం’ సూపర్ హిట్ తరువాత ఇది గోపిచంద్ సినిమా అని చెప్పుకునే స్థాయిలో మరో మూవీ హిట్ కొట్టలేదు.  మంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్న గోపిచంద్‌ను డైరెక్టర్ మారుతి అయినా గట్టెక్కిస్తారో లేదో చూడాలి మరి.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. జులై 1న సినిమాను విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. జీఏ2 పిక్చర్స్, UV క్రియేష‌న్స్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Gopichand (@yoursgopichand)

Recent Articles English

Gallery

Recent Articles Telugu