HomeTelugu Trendingఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న హీరో నిఖిల్‌

ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న హీరో నిఖిల్‌

Nikhil wins a Pan India award for Karthikeya 2

హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఇటీవలే కార్తికేయ- 2 తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. నిఖిల్ చేసిన తొలి పాన్ ఇండియన్ మూవీ ఇది. ఈ సినిమాపై విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్ గా విజయాన్ని అందుకుంది. చందు మొండేటి డైరెక్షన్‌లో వచ్చిన ఈసినిమా తెలుగు, నార్త్‌ల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా 121 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది ఈ సినిమా.

అవార్డుల విభాగంలోనూ ఈ నటుడు తన సత్తాను నిరూపించుకున్నాడు. ఐకానిక్ గోల్డ్ అవార్డ్స్ 2023లో నిఖిల్ సిద్ధార్థ పాపులర్ ఛాయిస్‌లో ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు. తాజాగా ఈ అవార్డును నిఖిల్​ అందుకున్నారు. అందుకు సంబంధించిన వీడియోను నిఖిల్​.. సోషల్​ మీడియాలో పంచుకున్నారు. బ్యాక్​గ్రౌండ్​లో ‘హే కేశవ.. హే మాధవ.. హే గోవిందా’ పాటను జోడించి పోస్ట్​ చేశారు. అయితే ఆ వీడియో చూసిన ఫ్యాన్స్​.. నిఖిల్​కు అభినందనులు చెబుతున్నారు.

కార్తికేయ సిరీస్‌లో మూడో భాగం ఉంటుందా? అని నిఖిల్​ను ప్రశ్నించగా, ‘కచ్చితంగా ఉంటుంది. సాహసాలను, సమస్యలను , మిస్టరీలను ఛేదించే ఉత్సాహం ఉన్న డాక్టర్‌ కార్తీక్‌ పాత్ర కొనసాగుతూనే ఉంటుంది. మన దేశ సంస్కృతిలో ఎవరికీ తెలియని ఎన్నో కథలు ఉన్నాయి. వాటిని స్ఫూర్తిగా తీసుకుని మరిన్ని భాగాలతో మీ ముందుకు వస్తాం అని నిఖిల్‌ చెప్పుకొచ్చారు.

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu