HomeTelugu Trending'గార్డియన్‌' టీజర్‌ తో భయపెడ్డుతున్న హన్సిక

‘గార్డియన్‌’ టీజర్‌ తో భయపెడ్డుతున్న హన్సిక

Guardian Tamil Teaserటాలీవుడ్‌లో దేశ ముదురు సినిమా తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ హన్సిక. ఈ మధ్య కాలంలో ఈఅమ్మడు తమిళ సినిమాలతో బిజీగా ఉంటుంది. అక్కడ కమర్షియల్‌ హీరోయిన్ గానే కాకుండా లేడీ ఓరియంటెడ్‌ సినిమాల్లో కూడా నటిస్తూ మెప్పిస్తోంది. హీరోయిన్ గా హన్సిక త్వరలో ‘గార్డియన్‌’ అనే హర్రర్‌ లేడీ ఓరియంటెడ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

శబరి మరియు గురు శరవణన్‌ దర్శకద్వయం ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు. తమిళ్ తో పాటు ఇతర భాషల్లో కూడా ఈ దెయ్యం సినిమా ఆకట్టుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి చేతుల మీదుగా ‘గార్డియన్‌’ సినిమా యొక్క టీజర్ ను విడుదల చేయడం జరిగింది.

హన్సిక ఒక సాధారణ అమ్మాయి. అయితే కొన్ని కారణాల వల్ల ఆమె ఒక ఆత్మ తో పీడింపబడుతుంది. దాంతో హన్సిక దెయ్యం గా మారి తాను అనుకున్నది చేస్తూ ఉంటుంది. ఆ క్రమంలో హన్సిక కు పలు షాకింగ్‌ విషయాలు తెలుస్తాయి అని టీజర్ లో చూపించారు. ప్రముఖ దర్శకుడు విజయ్‌ చందర్‌ ఈ సినిమాను నిర్మించడం జరిగింది. సామ్‌ సిఎస్ సంగీతాన్ని అందించాడు. తాజాగా టీజర్ ను విడుదల చేయడం ద్వారా సినిమాపై మంచి హోప్స్‌ ఏర్పడ్డాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu