HomeTelugu TrendingBigg Boss 18 తో సల్మాన్ ఖాన్ ఎంత సంపాదించారో తెలుసా?

Bigg Boss 18 తో సల్మాన్ ఖాన్ ఎంత సంపాదించారో తెలుసా?

Guess how much Salman Khan made with Bigg Boss 18!
Guess how much Salman Khan made with Bigg Boss 18!

Salman Khan Bigg Boss 18 remuneration:

బిగ్ బాస్ 18 జనవరి 19న గ్రాండ్ ఫినాలేతో ముగిసింది. ఈ సీజన్‌లో కరణ్ వీర్ మెహ్రా విజేతగా నిలిచి ట్రోఫీతో పాటు భారీ ప్రైజ్ మనీని గెలుచుకున్నారు. కానీ ఈ ఫినాలేలో నిజమైన హైలైట్ సల్మాన్ ఖాన్ ఇచ్చిన ఎమోషనల్ స్టేట్‌మెంట్.
సల్మాన్ ఖాన్, 2010 నుంచి బిగ్ బాస్ హోస్ట్‌గా ఉన్నారు. ఈ సీజన్ కోసం ఆయన ఏకంగా రూ. 250 కోట్లు తీసుకున్నారని సమాచారం. ఆయన ప్రతీ నెలా దాదాపు రూ. 60 కోట్లు సంపాదించారని అంచనా. బిగ్ బాస్ 17 కోసం రూ. 150 కోట్లు తీసుకున్న సల్మాన్, ఈ సీజన్‌లో తన పారితోషికాన్ని గణనీయంగా పెంచుకున్నారు.
ఫినాలే సమయంలో సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ, “నేను 15-16 సీజన్లు హోస్ట్ చేశాను… కానీ మళ్లీ చేయడం కష్టం,” అని చెప్పడం అభిమానులను భావోద్వేగానికి గురిచేసింది. దీంతో, సల్మాన్ ఇక బిగ్ బాస్‌లో హోస్ట్‌గా కనిపించరా? అనే ప్రశ్న అందరిలోనూ మెదలుతోంది.
సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా బిగ్ బాస్ ని కొత్త ఎత్తులకు తీసుకెళ్లారు. ఆయన లేకుండా బిగ్ బాస్ ఎలా ఉంటుందో అనేది ఇప్పటినుంచే అందరి మనసులో సందేహంగా మారింది. మరోవైపు ఈ సీజన్‌లో పోటీదారుల మధ్య కఠినమైన పోటీ జరిగింది. వివియన్ డిసేనాతో తలపడి, కరణ్ వీర్ మెహ్రా విజేతగా నిలిచారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu