HomeTelugu Trendingఓరి దేవుడా: గుండెలోనా సాంగ్‌ విడుదల

ఓరి దేవుడా: గుండెలోనా సాంగ్‌ విడుదల

Gundellonaa Lyrical song fr
టాలీవుడ్‌ యువ నటుడు విష్వక్సేన్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఓరి దేవుడా’. ఆశా భట్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్‌ నటుడు వెంకటేశ్ ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి, అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించాడు.

కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియో సాంగ్ విడుదలైంది. ‘ఇడువనే ఇడువనే క్షణం కూడా నిన్నే బుజ్జమ్మా బుజ్జమ్మా .. మరువనే మరువనే కలల్లోను నిన్నే బుజ్జమ్మా బుజ్జమ్మా’ అంటూ ఈ పాట సాగుతోంది. హీరో … హీరోయిన్లపై చిత్రీకరించిన పాట ఇది. లీన్ జేమ్స్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు.

కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించిన ఈ పాటను అనిరుద్ ఆలపించాడు. ఈ నెల 21వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందనేది చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu