HomeTelugu Trendingరవితేజ నిర్మించిన సుందరం మాస్టర్ టీజర్

రవితేజ నిర్మించిన సుందరం మాస్టర్ టీజర్

Sundaram Master Teaser

టాలీవుడ్ పాపులర్ కమెడియన్ వైవా హర్ష, దివ్య శ్రీపాద ప్రధాన పాత్రల్లో ‘సుందరం మాస్టర్’ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాకు హీరో రవితేజ, సుధీర్ కుమార్ నిర్మాతలు. నూతన దర్శకుడు కల్యాణ్ సంతోష్ ఈ ప్రాజెక్టును చేపట్టాడు.

ఈ సినిమా టీజర్‌ను తాజాగా చిత్రబృందం విడుదల చేసింది. హీరో సాయి ధరమ్ తేజ్, దర్శకులు చందు మొండేటి, సుధీర్ వర్మ ఆధ్వర్యంలో టీజర్ గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది.

ఈ మూవీ నుంచి ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ మంచి రెస్పాన్స్ అందుకుంది. టీజర్ కూడా ఆకట్టుకునేలా ఉంది. మంచి ఎంటర్‌టైన్‌గా అనిపిస్తోంది.

ఈ మధ్య ఆడియన్స్ కంటెంట్ బాగుంటే చాలనుకుంటున్నారు. కంటెంట్ కొత్తగా, వినోదభరితంగా ఉంటే ఆదరిస్తున్నారు. అలాంటి సినిమా భారీ వసూళ్లను సైతం రాబడుతోంది. అందుకే కొత్త దర్శకులు వీలైనంత వరకూ డిఫరెంట్ కంటెంట్‌తోనే వస్తున్నారు.

అటవీ ప్రాంతంలోని ఓ గిరిజన గూడెంలో ఈ సినిమా మొత్తం నడవనున్నట్లు తెలుస్తోంది. అక్కడి ప్రజలకు ఇంగ్లిష్ నేర్పించడానికి వెళ్లిన హర్షకు పెద్ద షాక్ తగులుతుంది.

అక్కడి గిరిజనులు తన కంటే బాగా ఇంగ్లిష్ మాట్లాడుతూ తెలివైనవారిగా కనిపిస్తారు. కామెడీ ప్రధానంగా తెరకెక్కినట్టు తెలుస్తోంది. శ్రీ చరణ్ పాకాల ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu