HomeTelugu Trendingభర్త విష్ణు విశాల్‌ మూవీ షూటింగ్ లో గుత్తా జ్వాల సందడి

భర్త విష్ణు విశాల్‌ మూవీ షూటింగ్ లో గుత్తా జ్వాల సందడి

gutta jwala attend her husb

భారత మాజీ బ్యాడ్మింటన్ గుత్తా జ్వాల సినీ నటుడు విష్ణు విశాల్ ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వైవిధ్య భరితమైన కథలను ఎంచుకుంటూ విష్ణు విశాల్ ఇప్పటి వరకు మంచి చిత్రాలను చేశాడు. మంచి నటుడిగా గుర్తింపును తెచ్చుకున్నాడు. తాజాగా ‘ఆర్యన్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. క్రైమ్, థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో ఆయన పోలీస్ అధికారి పాత్రను పోషిస్తున్నాడు.

ఈ మూవీలో శ్రద్ధా శ్రీనాథ్, వాణి భోజన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమానికి గుత్తా జ్వాల హాజరై సందడి చేసింది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. మరోవైపు మూవీ డైరెక్టర్‌ ప్రవీణ్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో విష్ణు విశాల్ పవర్ ఫుల్ పోలీసు అధికారి పాత్రను పోషిస్తున్నాడని చెప్పారు. ఊహించని మలుపులతో ఈ సినిమా ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తుందని చెప్పారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu