HomeTelugu Trendingహన్సిక డిజిటల్‌ ఎంట్రీ

హన్సిక డిజిటల్‌ ఎంట్రీ

 

Hansika Digital Entry

హీరోయిన్‌ హన్సిక పెళ్లయిన తరువాత కూడా వరుస సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా ఆమె ఓటీటీలోకి కూడా ఎంట్రీ ఇస్తోంది. ఆమె కీలక పాత్రలో ‘ఎమ్‌.వై.3’ అనే వెబ్ సిరీస్‌ తెరకెక్కింది. మూగెన్ రావు హీరోగా న‌టిస్తున్న ఈ సిరీస్‌కు రాజేష్‌. ఎం దర్శకత్వం వహిస్తున్నారు.

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రేపటి నుంచి ఈ సిరీస్‌ స్ట్రీమ్ కానుంది. శంత‌ను భాగ్యరాజ్, జనని అయ్యర్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. నిన్న ట్రైలర్ విడుదలైంది. ఇదొక సైంటిఫిక్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌. ఇందులో మైత్రి అనే హ్యూమనాయిడ్ రోబోగా, మనిషిగా హన్సిక రెండు పాత్రలు పోషించింది.

ఈ సిరీస్‌లో రోబోగా హ‌న్సిక లుక్‌, మ్యాన‌రిజ‌ం ఆకట్టుకుంటోంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, బెంగాలీ, మరాఠీ భాషల్లో అందుబాటులో ఉండనుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu