HomeTelugu Trendingబన్నీ సినిమా సెన్సార్‌ పూర్తి..

బన్నీ సినిమా సెన్సార్‌ పూర్తి..

8 2
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అల వైకుంఠపురములో’ చిత్రం రూపొందింది. అల్లు అర్జున్ .. పూజా హెగ్డే హీరో, హీరోయిన్‌లుగా నటించిన ఈ సినిమాలో ‘టబు’ కీలకమైన పాత్రను పోషించింది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డువారు ఈ సినిమాకి U/A సర్టిఫికెట్ ను మంజూరు చేశారు.

గీతా ఆర్ట్స్ .. హారిక అండ్ హాసిని వారు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను, సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదల చేయనున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో బన్నీ డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నాడు. తమన్ సంగీతం పాప్యులర్ కావడంతో, ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. త్రివిక్రమ్ – బన్నీ కాంబినేషన్లో మరో హిట్ పడిపోయినట్టేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu