HomeTelugu Trendingతేజ సజ్జా 'హనుమాన్' వీడియో

తేజ సజ్జా ‘హనుమాన్’ వీడియో

Hanuman first look released

క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ హీరో తేజ సజ్జా కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం ”హను-మాన్”. ఈ సినిమా టైటిల్‌ని విడుదల చేసిన దగ్గర నుంచి, కంటెంట్ ఎలా ఉండనుందనేది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తూ ఉంది. తాజాగా ఈ సినిమా నుంచి తేజ సజ్జా ఫస్టులుక్ తో పాటు, ఒక వీడియోను కూడా విడుదల చేశారు.

ఈ వీడియోలో తేజ సజ్జా గిరిజన యువకుడి పాత్రలో కనిపిస్తున్నాడు. ఉండేల్ ధరించి అడవిలో వేటకి దిగినట్టుగా ఉన్నాడు. ఆయన మెడలో సూర్యుడిని పోలిన ఒక లాకెట్ కనిపిస్తోంది. అదే ముద్ర టైటిల్ లోను కనిపిస్తుంది కనుక, ఆయనలోని సూపర్ హీరో పవర్స్ కి ఆ లాకెట్ కారణమని అనుకోవచ్చు. శ్రీమతి చైతన్య సమర్పణలో ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కె.నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు మరో నాలుగు భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu