HomeTelugu Trendingహనుమాన్: థర్డ్‌ సింగిల్‌ అప్డేట్‌

హనుమాన్: థర్డ్‌ సింగిల్‌ అప్డేట్‌

Hanuman Third Single Update
టాలీవుడ్‌ యంగ్‌ హీరో తేజ సజ్జ -ప్రశాంత్ వర్మ కాంబినేష్‌లో వస్తున్న యాక్షన్ సూపర్ హీరో మూవీ ‘హను మాన్’. ఈ సినిమా ప్రారంభం నాటి నుండి ప్రేక్షకుల్లో భారీ హైప్స్‌ ఉన్నాయి. పాన్ ఇండియన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి ఇప్పటి వరకూ విడుదలైన రెండు సాంగ్స్ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి.

ఈ క్రమంలో మేకర్స్‌ థర్డ్‌ సింగిల్‌ అప్డేట్‌ ఇచ్చారు. నవంబర్ 28న మూడవ సాంగ్ ని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్ పై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మూవీకి శ్రీమతి చైతన్య సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు.

గౌరహరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ సంగీతం అందిస్తున్నారు. శివేంద్ర సినిమాటోగ్రఫీని అందిస్తున్న ఈ మూవీ జనవరి 12న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది. అమృత అయ్యర్‌ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో వినయ్‌రాయ్‌, వరలక్ష్మి శరత్‌కుమార్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు

Recent Articles English

Gallery

Recent Articles Telugu