HomeTelugu Trendingఅనుష్క 'నిశ్శబ్దం' ట్రైలర్‌

అనుష్క ‘నిశ్శబ్దం’ ట్రైలర్‌

Nishabdham Trailer
స్టార్ హీరోయిన్ అనుష్క, మాధవన్‌, అంజలి కీలక పాత్రల్లో నటిస్తున్న సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీ ‘నిశ్శబ్దం’. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం థియేటర్లు తెరిచే పరిస్థితి లేకపోవడంతో అమెజాన్‌ వేదికగా అక్టోబరు 2న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ఇటీవల ప్రకటించింది. ఈ నేపథ్యంలో తాజాగా టాలీవుడ్‌ యంగ్‌ రానా ఈ సినిమా ట్రైలర్‌ను షేర్‌ చేశాడు. తెలుగుతోపాటు తమిళ, మలయాళ భాషల్లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇక ఈ సినిమాలో హాలీవుడ్ నటులు మైఖేల్ మ్యాడ్సన్ – హంటర్ ఓ హరో మరియు శ్రీనివాస అవసరాల ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. ‘భాగమతి’ సినిమా తరువాత అనుష్క చాలా గ్యాప్ తీసుకొని చేస్తున్న మూవీ కావడంతో ‘నిశ్శబ్దం’పై భారీ అంచనాలు ఉన్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu