HomeTelugu Big StoriesHappy Birthday Rashmika: నేషనల్‌ క్రష్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు

Happy Birthday Rashmika: నేషనల్‌ క్రష్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు

Happy Birthday Rashmika

Happy Birthday Rashmika: ఈ రోజు నేషనల్‌ క్రష్ రష్మిక మందన్నా పుట్టిన రోజు (ఏప్రిల్‌ 5). ఈసందర్భంగా ఆమెకు తన ఫ్యాన్స్‌తో పాటు సెలబ్రెటీలు కూడా సోషల్‌ మీడియా వేదికగా విషెస్‌ చెబుతున్నారు. రష్మికకు ఉన్న ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్‌లో ‘ఛలో’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది రష్మిక. విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన ‘గీతా గోవిందం’లో హీరోయిన్‌గా నటించింది.

గీతా గోవిందం సినిమా ఆమె కెరియర్‌ను మలుపు తిప్పింది. ఈ సినిమాలో ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టింది. విజయ్‌ దేవరకొండ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌, హయ్యేస్ట్‌ గ్రాస్‌ వసూళ్లు చేసింది. 100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ దెబ్బతో రష్మిక టాలీవుడ్‌ లక్కీ లెగ్‌ అయిపోయింది. ఆ తరువాత వరుసగా రెండు ప్లాప్స్‌ వచ్చాయి. ఆ తర్వాత ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భీష్మ’ చిత్రాలతో రష్మిక మళ్లీ సక్సెస్‌ బాట పట్టింది. వరుసగా తెలుగులో సినిమాలు చేస్తూనే మధ్యలో తమిళ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది.

Happy Birthday Rashmika2 Happy Birthday Rashmika,Rashmika,Pushpa,Animal,Geetha Govindam

హీరో కార్తి సరసన ‘సుల్తాన్‌’లో సందడి చేసింది. ఇదే ఆమె తొలి కోలీవుడ్‌ మూవీ. ఇదే సమయంలో పాన్‌ ఇండియా మూవీ ‘పుష్ప’తో బంపర్‌ ఆఫర్‌ కొట్టేసింది. ఈ చిత్రం వరల్డ్‌ వైడ్‌గా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అయ్యింది. ఇందులో ‘శ్రీవల్లి’గా ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో ఆమె పాన్‌ ఇండియా రేంజ్‌లో క్రేజ్‌ సంపాదించుకుంది. పుష్పతో వచ్చిన స్టార్‌ డమ్‌తో ఆమె బాలీవుడ్‌ చాన్స్‌లు అందుకుంది. సిద్ధార్థ్ మ‌ల్హోత్రా హీరోగా న‌టించిన ‘మిష‌న్ మ‌జ్నూ’తో ర‌ష్మిక బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ డిజాస్టర్‌. అయినా ఆమెకు అక్కడ ఆఫర్స్‌కి కొదువ లేదు.

ఫస్ట్‌మూవీ విడుదల కాకుండానే.. ఏకంగా బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌తో కలిసి నటించే లక్కీ చాన్స్‌ కొట్టేసింది. ‘గుడ్‌బై’లో అమితాబ్‌కు కూతురిగా నటించింది. ఈ సినిమా కూడా ఆశించిన విజయం ఇవ్వలేకపోయింది. కానీ, ఆ తర్వాత ఏకంగా బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌బీర్‌తో ‘యానిమల్‌’లో జతకట్టింది. గతేడాది డిసెంబర్‌లో రిలీజ్‌ అయిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టింది. ఈ చిత్రంతో మరో పాన్‌ ఇండియా హిట్‌ కొట్టింది. ప్రస్తుతం ఆమె వరుస పాన్‌ ఇండియా మూవీలతో బిజీగా ఉంది.

Happy Birthday Rashmika1 Happy Birthday Rashmika,Rashmika,Pushpa,Animal,Geetha Govindam

కన్నడ పరిశ్రమ నుంచి కెరీర్‌ ప్రారంభించిన రష్మిక ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా తన సత్తా చాటుకుంటుంది. తన క్యూట్‌ లుక్స్‌తో ‘నేషనల్‌ క్రష్‌’బిరుదు కూడా అందుకుంది. తనదైన నటనతో నాలుగు సైమా అవార్డులు, ఫిలిం ఫేర్‌ అవార్డ్స్‌తో పాటు మరిన్ని పురస్కారాలు అందుకుంది. మిడిల్‌ క్లాస్‌ నుంచి వచ్చిన ఆమె నటిగా ఎదిగి ఫోర్భ్స్‌ జాబితాలోనూ చోటు దక్కించుకుంది.

ఇక ఆమె తెలుగులో ‘పుష్ప: ది రూల్‌’ సినిమాలో నటిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ జరుగుతుంది. ఈ సినిమా ఈ ఏడాది ఆగస్ట్‌లో రిలీజ్‌కు రెడీ అవుతుంది. అలాగే ధ‌నుష్ హీరోగా శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న యాక్ష‌న్ మూవీలో ర‌ష్మిక హీరోయిన్‌గా న‌టిస్తోంది. మరోవైపు ఆమె చేతిలో ‘యానిమల్‌ పార్క్‌’ కూడా ఉంది. రష్మిక మరిన్ని సినిమాలతో కెరీయర్‌లో దూసుకుపోవాలని అశిస్తూ ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu