మళ్ళీ రిపీట్ అవుతుందా..?

గతేడాది సంక్రాంతి కానుకగా ఎన్టీఆర్, బాలకృష్ణ, నాగార్జునల సినిమాలతో పాటు శర్వానంద్ సినిమా కూడా రిలీజ్ అయింది. బాలయ్య ‘డిక్టేటర్’ కు ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో’ సినిమాల మధ్య పోటీ ఏర్పడింది. కావాలనే ఎన్టీఆర్ సినిమాను తొక్కెసే ప్రయత్నాలు జరిగినట్లు కొన్ని వార్తలు వినిపించాయి. దీంతో ఎన్టీఆర్ సినిమాపై సింపతీ పెరిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ అదే సీన్ చిరు సినిమా విషయంలో రిపీట్ అవుతోంది. సింగిల్ థియేటర్స్ అన్ని బాలయ్య సినిమా కోసం బ్లాక్ చేస్తున్నట్లు టాక్.

చిరు సినిమా ఫంక్షన్ విజయవాడ నుండి గుంటూరుకి షిఫ్ట్ కావడానికి కారణం కూడా చిరు సినిమాను తొక్కెసే ప్లాన్ లో ఒకటని సమాచారం. ఇప్పటికే ఈ విషయం పట్ల సోషల్ మీడియాలో అభిమానుల మధ్య మాటల యుద్ధమ్ జరుగుతోంది. సో.. ఇప్పటికే చిరు సినిమాపై సింపతీ పెరిగిపోయింది. దీంతో మళ్ళీ సంక్రాంతి సీన్ రిపీట్ అవుతున్నట్లు అనిపిస్తోంది.

CLICK HERE!! For the aha Latest Updates