హార్డ్ కోర్ ఫ్యాన్స్ సమక్షంలో రకుల్ పుట్టినరోజు వేడుకలు!

తాను నటించే ప్రతి సినిమాతోనూ స్టార్ స్టేటస్ తోపాటు స్టార్ సర్కిల్ ను కూడా సమానంగా పెంచుకుంటూ అగ్ర కథానాయకిగా నిలిచిన క్రేజీ కథానాయకి రకుల్ ప్రీత్ సింగ్ తన పుట్టినరోజు వేడుకలను నేడు (అక్టోబర్ 10) తన వీరాభిమానుల సమక్షంలో నిరాడంబరంగా జరుపుకొంది.
ఆంధ్ర-తెలంగాణాల్లోని రకుల్ ప్రీత్ వీరాభిమానుల్లో కొంతమందిని ఆన్ లైన్ లో జరిగిన పోలింగ్ ద్వారా సెలక్ట్ చేసి.. రకుల్ ప్రీత్ సింగ్ మేనేజింగ్ టీం గౌటి హరినాథ్, నవీన్ కుమార్ బుక్కాలు నిర్వహించిన ఈ ఫ్యాన్స్ మీట్ సందర్భంగా.. రకుల్ అభిమానులందరితోనూ ముచ్చటించింది.
రకుల్ స్వయంగా తామందరినీ గుర్తించి ఈ విధంగా కలిసినందుకు యువ అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు!
CLICK HERE!! For the aha Latest Updates