HomeTelugu Big Stories'హరిహర వీరమల్లు' టీజర్‌ విడుదల

‘హరిహర వీరమల్లు’ టీజర్‌ విడుదల

HariHaraVeeraMallu Power Gl

పవర్‌స్టార్ పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’. క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్‌లో పీరియాడికల్ ఫిక్షన్ ఫిల్మ్‌గా తెరకెక్కుతుంది. ఈ సినిమా నుంచి తాజాగా మరో అప్‌డేట్‌ ఇచ్చారు. నేడు(శుక్రవారం)పవన్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి పవర్‌ గ్లాన్స్‌ను శుక్రవారం ఉదయం విడుదల చేసింది. మెడల్ని వంచి కథల్ని మార్చి కొలిక్కితెచ్చే పెట్టుకొని తొడకొట్టాడో .. తెలుగోడు అనే పాటతో పవన్‌ ఫైట్స్‌ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక భీమ్లా నాయక్‌ తర్వాత పవన్‌ నటిస్తున్న సినిమా ఇదే కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

మెగా సూర్యా ప్రొడ‌క్షన్ బ్యాన‌ర్‌పై లెజండ‌రీ ప్రొడ్యూస‌ర్ ఎ.ఎం. ర‌త్నం సమర్పణలో నిర్మాత దయాకర్ రావు నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్‌ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల చేయనున్నారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడం, మలయళం, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu