సమంత కర్ర పట్టింది!

ఇటీవల కాలంలో తమ పాత్రల్లో ఒదిగిపోవడానికి కథానాయికలు ఎంతటి కష్టమైన శిక్షణనైనా తీసుకోవడానికి వెనుకడుగు వేయడం లేదు. ఇప్పటికే అనుష్క బాహుబలి, రుధ్రమదేవి వంటి సినిమాల కోసం యుద్ధ విద్యలు, గుర్రపుస్వారీ వంటి వాటిలో ప్రత్యేక శిక్షణ తీసుకుంది. అలానే రీసెంట్ గా శృతిహాసన్ ‘సఘమిత్ర’ సినిమా కోసం లండన్ లో కత్తిసాము నేర్చుకుంటోంది. దానికి సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేసింది.

ఇప్పుడు సమంత వంతు వచ్చింది. ప్రస్తుతం ఆమె ‘కర్రసాము’ నేర్చుకుంటోంది. కర్రసాము చేస్తూ సమంత పోస్ట్ చేసిన వీడియో నెట్ లో వైరల్ అవుతోంది. ప్రస్తుతం సమంత తెలుగు, తమిళ సినిమాలను వరుసగా చేస్తోంది. అయితే ఆమె ఏదైనా సినిమా కోసం కర్ర సాము నేర్చుకుంటుందా..? లేక ఫిట్ నెస్ కోసం చేస్తోందా..? అనే విషయం తెలియాల్సివుంది.