HomeTelugu Newsకొత్త సినిమా ప్రకటించిన హరీష్‌ శంకర్‌

కొత్త సినిమా ప్రకటించిన హరీష్‌ శంకర్‌

13 4పవర్‌ స్టార్‌ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల‌ను డైరెక్ట్ చేసిన దర్శకుడు హ‌రీశ్ శంక‌ర్‌. ఈ ఏడాది ఈయ‌న తెర‌కెక్కించిన ‘గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్‌’ మంచి విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ఈ స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ తాజాగా నిర్మాత‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన మ‌హేష్‌ కొనేరుతో సినిమా చేయ‌బోతున్నారు. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా ప్ర‌క‌టించారు. త్వ‌ర‌లోనే మ‌హేష్ కొనేరు నిర్మాణ సంస్థ ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌లో తాను సినిమా చేయబోతున్న‌ట్లు తెలిపారు. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌నుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu