
బటన్ రెడ్డి పై చంద్రబాబు ప్రేమ చూపించాడా?, లేకపోతే.. ఎందుకు బటన్ రెడ్డి పాపాలను చంద్రబాబు సహించారు ?, ఎందుకు ?, అసత్యాలు, అబద్ధాలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నప్పుడే బటన్ రెడ్డిని ఎందుకు క్షమించారు ?,
టీడీపీ హయాంలో 6 లక్షల కోట్లు అవినీతి జరిగింది అని పుస్తకాలు వేసినప్పుడే.. మీ ఆరోపణలకు ఆధారాలు చూపండి అని బటన్ రెడ్డికి నోటీసులు ఎందుకు ఇవ్వలేదు ?,
అగ్రీ గోల్డ్ ఆస్తులు టీడీపీ వారే కొట్టేశారు అని ఆరోపణలు చేసినప్పుడు.. హాయ్ లాండ్ లోకేష్ కొట్టేశాడు అని ఆరోపణలు చేసినప్పుడు.. బాబు గారిని నడిరోడ్డులో కాల్చాలి అన్నప్పుడే.. బటన్ రెడ్డి పై క్రిమినల్ కేసు ఫైల్ చేసి ఎందుకు అరెస్ట్ చేయలేదు ?,
పోలవరం అంచనాల పెంపులో అవినీతి జరిగింది అని కూసినప్పుడే.. అది అమరావతి కాదు భ్రమరావతి అని కాదు కాదు కమ్మరావతి అన్నప్పుడు.. సీఎం గా వున్న బాబు గారిని చెంపకు పెట్టీ కొట్టాలి, రాళ్లతో కొట్టాలి అన్నప్పుడు.. బటన్ రెడ్డిని ఎందుకు బొక్కలో పడేయలేదు ?,
అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అని వాగినప్పుడు.. ఏపీ ఫైబర్ నెట్ లో అవినీతి జరిగింది అని ఆరోపించినప్పుడే… విశాఖ CII ఇన్వెస్టర్ సమ్మిట్ జరిగినప్పుడు లోకేష్ 25 లక్షల స్నాక్స్ తినేశాడు అని తప్పుడు కూతలు కూసినప్పుడే.. ఎందుకు బటన్ రెడ్డి పై యాక్షన్ తీసుకోలేదు?,
కోడి కత్తి డ్రామా టీడీపీకి చంద్రబాబుగారికి ఆపాదించినప్పుడే… చంద్రబాబు అసమర్థత వల్లే ప్రత్యేక హోదా రావడం లేదు అని ప్రచారం చేసినప్పుడే… శ్రీవారి పింక్ డైమండ్ బాబు గారు కొట్టేశారు అన్నప్పుడే… శ్రీకృష్ణ దేవరాయలుగారు శ్రీవారికి ఇచ్చిన నగలు బాబు గారి ఇంటి నేలమాళిగల్లో వున్నాయి అని తప్పుడు కూతలు కూసినప్పుడే… ఎందుకు బటన్ రెడ్డి మక్కెలు విరగకొట్టలేదు?,
సదావర్తి భూములు టీడీపీ వారే కొట్టేశారు అని అన్నప్పుడే…38 మంది CI లు, DSP లుగా ప్రమోట్ అయితే అందులో 33 మంది కమ్మ వారే అని అబద్ధపు ప్రచారాలు చేసినప్పుడే… ఎందుకు బటన్ రెడ్డి పై పరువునష్టం దావా వేయలేదు?,
బటన్ రెడ్డి బ్యాచే పుణ్యం కట్టుకున్న వివేకానంద రెడ్డి గారి రక్తపు మరకలను చంద్రబాబు గారికి పులిమినప్పుడే.. బటన్ రెడ్డి నేర నీచపు స్వభావాన్ని ఎందుకు అరికట్టలేదు?,
ఇలా బటన్ రెడ్డి పుంఖాను పుంఖాలుగా టీడీపీ చేయని అవినీతిని చేశారని చెప్పినప్పుడు..జరగని నేరాలు జరిగినట్టు అరోపించినప్పుడే.. అన్నీ అసత్యాలు అబద్ధాలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నప్పుడే… అధికారం చేతిలో వుండి.. చట్టపరంగా చర్య తీసుకునే అవకాశం కళ్ళ ముందే వున్నా… స్పందించాల్సిన స్థాయిలో చంద్రబాబు స్పందించలేదు. పరువు నష్టం దావాలు వేయలేదు. ఆరోపణలకు ఆధారాలు చూపండి అని నోటీసులు ఇవ్వలేదు. బటన్ రెడ్డిని కట్టడి చేయాల్సిన అవసరం, అవకాశం కనీసం గుర్తించలేదు అప్పటి ప్రభుత్వం. అది బాబు మంచితనం కావొచ్చు. ప్రజాస్వామ్యానికి బాబు ఇచ్చే విలువ కావొచ్చు. ఏది ఏమైనా ఆనాడే బటన్ రెడ్డి అబద్దపు ప్రచారాలను కట్టడి చేసి ఉంటే.. నేడు 5 కోట్ల ఆంధ్రులకి ఈ దరిద్రం తప్పేది. ఫాపం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు.













