లగడపాటి సర్వేపై చంద్రబాబు ఏమన్నారంటే..!

తెలంగాణలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తాను నిర్వహించిన సర్వే వివరాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ నిన్న వెల్లడించిన తెలంగాణ ఎన్నికల సర్వేపై స్పందిస్తూ లగడపాటి సర్వే సైతం మహాకూటమి విజయం తథ్యమని చెప్పిందన్నారు. ఇక టీఆర్‌ఎస్ పని అయిపోయిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రెండున్నర నెలల క్రితం లగడపాటి రాజగోపాల్‌ చేసిన సర్వే ప్రకారం టీఆర్‌ఎస్‌కు 90 సీట్లు వస్తాయంటే ఆనందపడ్డ కేసీఆర్‌.. ఇప్పుడు టీఆర్‌ఎస్ ఓడిపోతుందని చెబితే లగడపాటిపై విమర్శలకు దిగుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని చంద్ర గార్డెన్స్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ప్రజాకూటమి బలపరిచిన టీడీపీ అభ్యర్థి సండ్ర వెంకట వీరయ్యకు మద్దతుగా చంద్రబాబు ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను
చిత్తుచిత్తుగా ఓడించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

CLICK HERE!! For the aha Latest Updates