Homeతెలుగు వెర్షన్మాగుంట శ్రీనివాసుల రెడ్డి గ్రాఫ్ ఎలా ఉంది ?, వచ్చే ఎన్నికల్లో పరిస్థితేంటి ?

మాగుంట శ్రీనివాసుల రెడ్డి గ్రాఫ్ ఎలా ఉంది ?, వచ్చే ఎన్నికల్లో పరిస్థితేంటి ?

What is the graph of Magunta Srinivasula Reddy

ఈ రోజు రాజకీయ నాయకుడి గ్రాఫ్ ? మరియు నేపథ్యం విషయానికి వస్తే.. ‘మాగుంట శ్రీనివాసుల రెడ్డి’. ప్రస్తుతం ప్రజల్లో మాగుంట శ్రీనివాసుల రెడ్డి పరిస్థితేంటి ?, వచ్చే ఎన్నికల్లో మాగుంట శ్రీనివాసుల రెడ్డి గ్రాఫ్ ఎలా ఉండబోతుంది ?, అసలు ఆయన నేపథ్యం ఏమిటి ? తెలుసుకుందాం రండి. మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని తోటపల్లి గూడూరు గ్రామంలో సంపన్న రైతు కుటుంబంలో జన్మించారు. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం శ్రీనివాసుల రెడ్డి ‘నెల్లూరు వి. ఆర్. డిగ్రీ కళాశాల’లో బీకాం పూర్తి చేశారు. శ్రీనివాసుల రెడ్డి కుటుంబ నేపథ్యం లోకి వెళ్తే… తండ్రి రాఘవ రెడ్డి గారు వ్యవసాయాన్ని వదిలి, వ్యాపార రంగంలో ప్రవేశించారు. ఐతే, ఆయన తన వ్యాపారాలను విజయవంతంగా నడిపిస్తున్న దశలోనే ఆకస్మికంగా మరణించారు. అనంతరం శ్రీనివాసుల రెడ్డి సోదరుడు మాగుంట సుబ్బిరామి రెడ్డి కుటుంబ వ్యాపార బాధ్యతలు చేపట్టి లిక్కర్, సినిమా హాళ్లు, హోటల్స్ రంగాల్లో అభివృద్ధి పథంలో వ్యాపారాలను నడిపించారు. శ్రీనివాసుల రెడ్డి ఉన్నత విద్యను పూర్తి చేసిన తర్వాత సోదరుడికి వ్యాపారాల నిర్వహణలో చేదోడుగా నిలుస్తూ వచ్చారు.

ఆ తర్వాత కాలంలో శ్రీనివాసుల రెడ్డి సోదరుడు దివంగత మాగుంట సుబ్బి రామిరెడ్డి వ్యాపారవేత్త గానే కాకుండా రాజకీయాల్లో కూడా రాణించారు. 1991 లో ఒంగోలు ఎంపీగా విజయం సాధించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ లో అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్న దశలోనే నక్సలైట్ల కాల్పుల్లో సుబ్బి రామిరెడ్డి మరణించడం జరిగింది. సోదరుడి రాజకీయ వారసుడిగా రాజకీయాల్లో అడుగుపెట్టిన శ్రీనివాసుల రెడ్డి 1996, 1998, 2004, 2009 లలో ఒంగోలు ఎంపీగా విజయం సాధించారు. 2014 లో జరిగిన రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి ఒంగోలు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే, 2015 లో జరిగిన స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీ గా ఎన్నికయ్యారు. అలాగే, తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షడిగా పనిచేశారు. 2019 ఎన్నికల నాటికి అనుచరులు ఒత్తిడి మరియు స్థానిక అంశాలను పరిగణనలోకి తీసుకుని జగన్ సమక్షంలో వైకాపా తీర్థం పుచ్చుకొని ఆ పార్టీ నుంచి ఒంగోలు ఎంపీ గా పోటీ చేసి ఎంపీగా విజయం సాధించారు.

సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్న శ్రీనివాసుల రెడ్డి గారికి అన్ని పార్టీల నాయకులతో సత్సంబంధాలు ఉన్నాయి. వివాదాలకు దూరంగా ఉంటూ వచ్చిన ఆయన ఇటీవల కాలంలో ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో తన పేరు రావడంతో కొంచెం ఇబ్బందికి గురయ్యారు. నిజానికి ఆయన ఎంపీగా ఎన్నికైన నాటి నుంచి కొంచెం వివాదాస్పద నేతగా తయారయ్యారు. అలాగే ఆయన పై పలు అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఒంగోలు ప్రాంతంలో విస్తృతంగా ఇదే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి అయితే, మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ అయ్యింది. ఇక ఆయన గ్రాఫ్ విషయానికి వస్తే.. మాగుంట శ్రీనివాసుల రెడ్డి పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. కాబట్టి.. వచ్చే ఎన్నికల్లో మాగుంట శ్రీనివాసుల రెడ్డి గెలవడం దాదాపు కష్టమే. అంతగా ఆయన గ్రాఫ్ పడిపోయింది.

అందుకే, మాగుంట శ్రీనివాసుల రెడ్డి తనదైన శైలిలో వ్యూహాన్ని రచించారు. వచ్చే ఎన్నికల్లో మాగుంట శ్రీనివాసుల రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకొని తన పెద్ద కుమారుడు రాఘవ రెడ్డి ని అసెంబ్లీ లేదా లోక్ సభ ఎన్నికల్లో నిలబెట్టేందుకు తెర వెనుక ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీ పార్టీ నుంచి అభయం కూడా వచ్చింది. ఒకవేళ జగన్ రెడ్డి తన కుమారుడికి టికెట్ ఇవ్వని పక్షంలో మళ్లీ టీడీపీ లో జాయిన్ అయి, తన కుమారుడికి టికెట్ ఇప్పించుకోవడానికి మాగుంట శ్రీనివాసుల రెడ్డి ప్లాన్ చేస్తున్నారు. ఐతే, ఈ సారి ఎన్ని రకాలుగా ప్లాన్ చేసినా… మాగుంట కుటుంబం రాజకీయాల్లో గెలవడం కష్టమే. ప్రజల్లోనే ఉంటే.. ఆ పైవచ్చే ఎన్నికల్లో గెలిచే ఛాన్స్ ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu