HomeTelugu Big Storiesప్రభాస్‌ తల్లిగా బాలీవుడ్‌ సీనియర్‌ హీరోయిన్!

ప్రభాస్‌ తల్లిగా బాలీవుడ్‌ సీనియర్‌ హీరోయిన్!

Hema Malini as prabhas moth
యంగ్‌ రెబల్‌ స్టార్‌ బాలీవుడ్‌ డైరెక్టర్‌ ఓం రౌత్‌తో ‘ఆదిపురుష్‌’ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నాడు ప్రభాస్‌. ఈ సినిమాలో ప్రభాస్‌ రాముడి పాత్రలో కనిపించగా.. రావణుడి పాత్రలో సైఫ్‌ అలీఖాన్‌ కనిపించనున్నారు. ఈ చిత్రంలో సీనియర్‌ నటి హేమమాలిని ఓ కీలక పాత్రలో నటించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల చిత్రబృందం ఆమెను సంప్రదించగా, నటించేందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. రామాయణ ఇతిహాసం నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో హేమ మాలిని రాముడి (ప్రభాస్‌ల) తల్లిగా కనిపించనున్నారట. టీ సిరీస్‌ ఫిల్మ్స్‌ సమర్పణలో భూషణ్‌ కుమార్, ఓం రౌత్, కిషన్‌ కుమార్, ప్రసాద్‌ సుతార్, రాజేష్‌ నాయర్‌ నిర్మించనున్న ఈ చిత్రాన్ని 2022 ఆగస్ట్‌ 11న విడుదల చేయనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu