HomeTelugu Newsహీరో- డైరెక్టర్‌ లిప్‌లాక్‌ వైరల్‌

హీరో- డైరెక్టర్‌ లిప్‌లాక్‌ వైరల్‌

11 17
సాధారణంగా సినిమాల్లో హీరో, హీరోయిన్‌ లిప్‌లాక్‌ సీన్‌లు మనం చూస్తాం. కానీ హీరో-డైరెక్టర్‌ లిప్‌లాక్‌ ఫోటోలు బయట పడితే అది సెన్సేషన్‌ విషయమే అవుతుంది. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో విడుదలైన లేటెస్ట్‌ తెలుగు సినిమా ‘కృష్ణ అండ్‌ హిజ్‌ లీలా’. రవికాంత్‌ పెరుపు దర్శకత్వంలో సిద్దూ జొన్నలగడ్డ హీరోగా నటించిన ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో గురువారం విడుదలై మంచి టాక్‌ను సంపాదించుకుంది. అందరూ సినిమా గురించి మాట్లాడుకుంటున్న సమయంలో హీరో- డైరెక్టర్‌ల లిప్‌లాక్‌ ఫోటో ఇప్పుడు వారందరికి షాక్‌ ఇస్తోంది. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. కొన్ని సంవత్సరాల క్రితం షూటింగ్‌ మొదలు పెట్టిన ఈ సినిమా పూర్తయి గురువారం నాడు నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్‌ అయ్యింది. ఈ మూవీలో సిద్దూ జొన్నలగడ్డ, శ్రద్ధా శ్రీనాధ్‌, షాలిని వడ్నికట్టి నటించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu