మీ ప్రేమ, ఆదరణే నన్ను, మహేశ్‌ను నడిపిస్తున్నాయి: నమ్రత


సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు ‘ఏఎంబీ’ సినిమాస్‌ పేరుతో మల్టీప్లెక్సును ప్రారంభించిన సంగతి తెలిసిందే. గచ్చిబౌలిలోని బొటానికల్‌ గార్డెన్‌లో నిర్మించిన ఈ మల్టీప్లెక్సును డిసెంబరు 2న కృష్ణ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తన మామయ్యతో కలిసి దిగిన ఫొటోను మహేష్ సతీమణి నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. . ‘మీ ప్రేమ, ఆదరణే.. నాకు, మహేష్‌బాబుకు బలాన్ని ఇచ్చి ముందుకు నడిపిస్తున్నాయి. మా కోసం వచ్చి, కార్యక్రమాన్ని ఇంకా ప్రత్యేకం చేసిన మీకు ధన్యవాదాలు డాడ్‌ (కృష్ణ). మాకు స్ఫూర్తిదాయకం మీరే’ అంటూ ‘అంతులేని ప్రేమ’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను నమ్రత జత చేశారు.

రెండో రోజుల క్రితం నమ్రత 150 మంది చిన్నారులకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు నిర్వహించినట్లు సోషల్‌మీడియాలో పేర్కొన్నారు. అన్నీ సర్జరీలు విజయవంతమయ్యాయని ఆనందం వ్యక్తం చేశారు. మహేష్‌ దత్తత తీసుకున్న సిద్ధాపురం, బుర్రిపాలెం గ్రామాల్లోని చిన్నారులకు ఈ ఉచిత సేవలు అందించినట్లు తెలుస్తోంది. ‘భరత్‌ అనే నేను’ తర్వాత మహేష్‌ ‘మహర్షి’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.‌ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది.

CLICK HERE!! For the aha Latest Updates