HomeTelugu Trendingరాఘవేంద్రరావు చేతుల మీదుగా... నాగశౌర్య కొత్త సినిమా ప్రారంభం

రాఘవేంద్రరావు చేతుల మీదుగా… నాగశౌర్య కొత్త సినిమా ప్రారంభం

Naga shourya new movie laun

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నాగశౌర్య తాజాగా లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి ఆయన సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన తదుపరి సినిమా పట్టాలెక్కింది. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా కొంతసేపటి క్రితం పూజా కార్యక్రమాలను జరుపుకుంది. రాఘవేంద్రరావు క్లాప్ ఇవ్వగా .. శ్రీకాంత్ ఓదెల కెమెరా స్విచ్చాన్ చేయగా ముహూర్తపు సన్నివేశాన్ని చిత్రీకరించారు. ‘లవ్ స్టోరీ’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న పవన్ సీహెచ్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.

ఈ సినిమాలో యుక్తి తరేజా హీరోయిన్‌గా అలరించనుంది. తెలుగులో ఆమెకి ఇదే తొలి సినిమా. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుపెట్టనున్నట్లు తెలస్తుంది. వచ్చే ఏడాదిలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. నాగశౌర్య సెట్స్ పైకి తీసుకెళ్లిన ‘ఫలానా అబ్బాయి – ఫలానా అమ్మాయి’ .. ‘పోలీస్ వారి హెచ్చరిక’ నుంచి అప్ డేట్స్ రావలసి ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu