HomeTelugu Trendingకేజీఎఫ్‌-2 టీజర్ వచ్చేస్తోంది

కేజీఎఫ్‌-2 టీజర్ వచ్చేస్తోంది

KGF2 update
కేజీఎఫ్ సినిమా జాతీయ స్థాయిలో రికార్డులు బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాతో జాతీయ స్థాయి డైరెక్టర్‌గా ప్రత్యేక గుర్తింపు పొందాడు. హీరో యష్‌ కూడా పాన్ ఇండియా స్టార్‌గా పేరు తెచ్చుకున్నాడు. దీంతో కేజీఎప్-2 చిత్రాన్ని కూడా ప్లాన్ చేశారు. కేజీఎఫ్2 కోసం దేశ వ్యాప్తంగా అనేక మంది అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందనలు వచ్చాయి. ఈ నెల 8న హీరో యష్ పుట్టిన రోజు సందర్భంగా కేజీఎఫ్ టీం అభిమానులకు సర్‌ప్రైజ్ ప్లాన్ చేసిందనే విషయం హాట్ టాపిక్‌గా మారింది. ఈ నెల 8 ఈ సినిమా టీజర్ విడుదల చేయనున్నట్టు దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు. రాజ్యపు తలుపులు తెరిచేందుకు కౌంట్‌డౌన్ స్టార్ అవుతుందంటూ పోస్ట్ చేశాడు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu