HomeTelugu Trendingనాని 30వ సినిమా టైటిల్ ఫిక్స్

నాని 30వ సినిమా టైటిల్ ఫిక్స్

Nani 30th movie title
నేచురల్ స్టార్ నాని 30వ సినిమాకు టైటిల్ ఫిక్స్ చేశారు. వరుస సినిమాలతో బిజీగా ఉండే నాని ప్రస్తుతం తన 30వ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం ద్వారా టాలీవుడ్‌కు కొత్త దర్శకుడు శౌర్యువ్‌ పరిచయమవుతున్నాడు.
ఈ చిత్రానికి ‘హాయ్‌ నాన్న’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. సినిమా ఫస్ట్‌లుక్ తో పాటు గ్లింప్స్ కూడా విడుదల చేశారు.

దసరా అనే ఊరమాస్ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి పాన్ ఇండియా స్టార్‌గా మారిన నాని ఇప్పుడు ‘హాయ్ నాన్న’ అంటూ ఓ క్లాస్ మూవీతో వస్తున్నారు. తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో నాని కూతురుగా బేబి కైరా ఖన్నా నటిస్తోంది.

జెర్సీ సినిమాలో తండ్రీకొడుకుల మధ్య భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులతో కంటతడి పెట్టించాయి. ఆ మూవీ తర్వాత నాని మరోసారి తండ్రి పాత్ర పోషిస్తున్నాడు.

ఈ మూవీలో నాని పక్కన హీరోయిన్‌గా మృణాళ్‌ ఠాకూర్ నటిస్తోంది. ఈ సినిమాను వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై మోహన్‌ చెరుకూరి, డాక్టర్ విజేందర్‌ రెడ్డి తీగల, మూర్తి కేఎస్‌ నిర్మిస్తున్నారు.

మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన హీషం అబ్దుల్‌ వహబ్‌ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో విడుదల చేయబోతునున్నారు. డిసెంబర్ 21న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu