జులియా-అనుష్క ఫొటో వైరల్‌.. ‘అనుష్కా..అమెరికాలో నీకో చెల్లి ఉందా?’

ఆమె అమెరికాకు చెందిన స్టార్‌ సింగర్‌.. మరి ఈమె భారత్‌కు చెందిన స్టార్‌ హీరోయిన్‌. కానీ ఇద్దరు పోలికలు ఒకటే. చూడటానికి ఇద్దరూ ఒకేలా ఉంటారు. ఇదేదో సినిమా కథలో పాత్రల చిత్రీకరణ కాదు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న అనుష్క శర్మ- జులియా మైకేల్స్ గాథ. వీరిద్దరి ముఖాల్లోనూ ఒకే పోలికలున్నాయి. దీంతో వీరికి సంబంధించిన ఫొటోలు నెట్‌లో వైరల్‌ అవుతున్నాయి. దీంతో అనుష్కను ట్యాగ్‌ చేసి నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

అమెరికన్‌ వర్ధమాన గాయని జులియా మైకేల్స్‌ ఇటీవల తన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. జులియా చూడటానికి అచ్చం బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌, విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మను పోలి ఉంది. ఇక నెటిజన్లు ఊరుకుంటారా? వీరిద్దరి ఫొటోలను పక్కపక్కనే పెట్టి కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘అనుష్క శర్మ అమెరికా వెళ్లింది’ అని, వెస్ట్రన్‌ వెర్షన్‌ అనుష్క శర్మ అని, ‘జులియా-అనుష్కలను పక్క పక్కనే నిలబెడితే విరాట్‌ కూడా కనిపెట్టలేడు’ అని, ‘ అనుష్కా..అమెరికాలో నీకో చెల్లి ఉందా?’ అంటూ కామెంట్లు కురిపిస్తున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates