HomeTelugu Trendingహీరో నానికి గాయాలు

హీరో నానికి గాయాలు

2 28నాచురల్ స్టార్ నాని జెర్సీ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది. ఇందులో నాని క్రికెటర్ గా కనిపిస్తున్నారు. వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేయాలనే ఆలోచనలో ఉన్నది యూనిట్. షూటింగ్ జరిగే సమయంలో నానికి గాయాలయ్యాయి. అయితే, కంగారు పడాల్సిన అవసరం లేదని, ముక్కుకు చిన్న గాయం అయిందని, నాని కాసేపు రెస్ట్ తీసుకొని తిరిగి షూటింగ్ పాల్గొన్నాడని యూనిట్ నుంచి సమాచారం. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో యు టర్న్ ఫేమ్ శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్. ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు.

దేవదాస్ తరువాత నాని చేస్తున్న సినిమా ఇదే. ఈ సినిమా తరువాత నాని, విక్రమ్ కుమార్ కాంబినేషన్లో సినిమా ప్రారంభం అవుతుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu