HomeTelugu Trendingతన ట్వీట్‌పై వివరణ ఇచ్చిన హీరో నాని

తన ట్వీట్‌పై వివరణ ఇచ్చిన హీరో నాని

Hero nani response on jai b

తమిళ హీరో సూర్య నటించిన జైభీమ్ చిత్రానికి జాతీయ అవార్డు రాకపోవడంపై నాని అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. హార్ట్ బ్రేక్ ఎమోజీని పోస్ట్ చేసినందుకు నానిపై పలువురు నెటిజన్లు విమర్శలు చేశారు.

తెలుగు హీరోలకు అవార్డులు వస్తే అభినందించకుండా తమిళ హీరోలకు రాలేదని బాధపడటం ఏమిటంటూ నానిపై పలువురు విమర్శలు చేశారు.

తనపై వస్తున్న విమర్శలకు స్పందిస్తూ ఈసారి తెలుగు సినిమాలకు ఎప్పుడూ లేనంతగా అధిక సంఖ్యలో జాతీయ అవార్డులు రావడం సంతోషం ఉంది.

తమిళ చిత్రం జైభీమ్ ఒక్క కేటగిరీలోనూ అవార్డు రాకపోవడం బాధగా అనిపించింది. అందుకే సోషల్ మీడియాలో హార్ట్ బ్రేక్ ఇమేజ్ పోస్ట్ చేశానని అన్నారు.

కానీ నా వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్ధం చేసుకున్నారని, కొన్ని వెబ్‌సైట్లలో తప్పుగా వార్తలు రాశారని నాని అన్నారు. నెపోటిజం గురించి చిత్ర పరిశ్రమ విషయంలోనే ఎందుకు మాట్లాడతారో అర్థం కావడం లేదని అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu