HomeTelugu Trendingటెక్నాలజీ ద్వారా రానా పెళ్లి చూస్తున్న నాని

టెక్నాలజీ ద్వారా రానా పెళ్లి చూస్తున్న నాని

Hero Nani watching Rana marటాలీవుడ్‌ యంగ్‌ హీరో దగ్గుబాటి రానా ఈ రోజు (ఆగష్టు 8)న పెళ్లి చేసుకుంటున్నాడు. ఈ సందర్భంగా రానా ‘రెడీ’ అంటూ ట్వీట్ చేయడమే కాకుండా తండ్రి సురేష్ బాబు, బాబాయి వెంకటేష్‌తో కలిసి సాంప్రదాయ వస్త్రధారణలో ఉన్న ఓ ఫొటోను కూడా విడుదల చేశారు. అయితే రానా పెళ్లి ప్రభుత్వ నిబంధనల మేరకు అతి తక్కువ మంది అతిథుల సమక్షంలోనే జరుగుతోంది. ఈ పెళ్లికి కేవలం 30 మంది అతిథులు మాత్రమే హాజరుకాబోతున్నారనే వార్తలు వచ్చాయి. పరిస్థితుల దృష్ట్యా మ‌రి పెళ్లికి రాలేని ఇండ‌స్ట్రీలోని ఇత‌ర సెల‌బ్రిటీలు, స్నేహితుల కోసం రానా వర్చువ‌ల్ రియాలిటీ టెక్నాల‌జీని ఉప‌యోగించ‌నున్నార‌ని ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే‌.

ఈ టెక్నాల‌జీలో ఉప‌యోగించాల్సిన సామాగ్రిని కూడా రానా త‌ను ఎవ‌రినైతే పిల‌వాల‌ని అనుకున్నారో వారికి పంపార‌ట‌. వాటిని ఎలా ఉప‌యోగించాల‌నే విష‌యాన్ని కూడా వారికి చేర‌వేశార‌ట‌. వ‌ర్చువ‌ల్ రియాలిటీ ఎక్విప్‌మెంట్‌ను ఉప‌యోగిస్తే.. మ‌నం కూడా పెళ్లిలో ఉన్న‌ట్లే అనిపిస్తుంది. కాబ‌ట్టి రానా ఈ ప‌ద్ధ‌తిలో త‌న పెళ్లిని చేసుకుంటున్నాడు. వీఆర్ టెక్నాల‌జీలో పెళ్లి చేసుకుంటున్న తొలి సెల‌బ్రిటీ రానానే కావ‌డం విశేషం. తాజాగా న్యాచురల్ స్టార్ నాని.. రానా పెళ్లిని ఎలా చూస్తున్నాడో వివరిస్తూ ఓ ఫొటోని షేర్ చేశారు. ‘‘రానా దగ్గుబాటి యొక్క ఐకానిక్ బ్రహ్మచారి ముగింపు చూస్తున్నాను. కంగ్రాచ్యులేషన్స్ బాబాయ్.. ఈ టెక్నాలజీ ఏంటో..’’ అని ట్వీట్‌లో పేర్కొన్న నాని.

Recent Articles English

Gallery

Recent Articles Telugu