HomeTelugu Trendingమమ్ముట్టి-జ్యోతిక సినిమాపై సమంత ప్రశంసలు

మమ్ముట్టి-జ్యోతిక సినిమాపై సమంత ప్రశంసలు

Samantha praises on Mammoot
టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత ప్రస్తుతం సినిమాకు బ్రేక్‌ తీసుకున్న సంగతి తెలిసిందే. సమంత ప్రస్తుతం తన హెల్త్ మీద ఫోకస్ పెట్టింది. సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటోంది. అయినా సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు టచ్‌లోనే ఉంటుంది. సమంత తనకు దొరికిన ఈ ఖాళీను టైంను సద్వినియోగం చేసుకుంటోంది. చిన్న చిత్రాలకు ప్రమోషన్స్ చేస్తోంది.

తన తోటీ తారల చిత్రాలకు సపోర్ట్ చేస్తోంది. కో స్టార్లకు బర్త్ డే విషెస్‌లు చెప్పడంలో ముందుంటుంది. తాజాగా సమంత ఓ సినిమాను చూసి ఫిదా అయింది. మలయాళీ సినిమా చూసి సమంత ఆ ట్రాన్స్‌లోనే ఉండి పోయింది. కాథల్ ది కోర్ అంటూ మమ్ముట్టి, జ్యోతిక నటించిన సినిమాను సమంత చూసింది. ఇక చూసిన వెంటనే సమంత తన ఎగ్జైట్మెంట్‌ను ఆపుకోలేకపోయినట్టుంది. వెంటనే తన ఇన్ స్టా స్టోరీలో ఇలా పెట్టేసింది.

మూవీ ఆఫ్ ది ఇయర్.. ఈ సినిమా చూస్తే మీకు మీరే మేలు చేసుకున్నట్టు అవుతుంది.. రత్నం లాంటి సినిమా మమ్ముట్టి సార్ మీరే నా హీరో ఇందులోంచి నేను బయటకు రాలేను. చాలా కాలం పట్టేలాఉంది. శానా యేళ్లు యాదుంటది. జ్యోతిక లవ్యూ.. జియో బేబీ లెజెండరీ దర్శకులు అని పొగిడేసింది సమంత.

samantha

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu