HomeTelugu Trending'తెలిసినవాళ్లు' నుంచి హీరో ఫస్ట్‌లుక్‌

‘తెలిసినవాళ్లు’ నుంచి హీరో ఫస్ట్‌లుక్‌

Hero ram first look from Te

కేఎస్వీ ఫిలిమ్స్ సమర్పణలో సిరెంజ్ సినిమా పతాకంపై రామ్ కార్తీక్, హెబ్బా పటేల్ నటిస్తున్న చిత్రం ‘తెలిసినవాళ్లు’. విప్లవ్ కోనేటి స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఈ చిత్రం 90 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రోస్ట్ ప్రొడక్షన్స్ కు వెళ్ళబోతున్న సందర్భంగా హీరో రామ్ కార్తీక్‌ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాత విప్లవ్ మాట్లాడుతూ.. ‘ఇప్పటికే విడుదల చేసిన హెబ్బా పటేల్ ఫస్ట్‌లుక్ కి ఎంతటి ఆదరణ లభించింది. అలాగే హీరో రామ్ కార్తీక్ లుక్ కూడా మంచి స్పందన లభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.

ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు కోవిడ్ కారణంగా షూటింగ్ డిలే అయ్యింది. ఇక ఇప్పటి నుంచి వినూత్నమైన రీతిలో ప్రమోషన్స్ చేయబోతున్నాం. హీరో, హీరోయిన్స్ రామ్ కార్తీక్, హెబ్బా పటేల్ చాలా బాగా నటించారు. మా సినిమాకు పనిచేస్తున్న టెక్నీషియన్స్ ఫిలిం స్కూల్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని సాంకేతిక నిపుణులుగా పని చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అత్యున్నత ప్రమాణాలతో నిర్మితమవుతున్న మా సినిమాలోని ఒక సాంగ్ మినహా దాదాపుగా పూర్తయ్యింది. మిగిలిన పది శాతం షూటింగ్ చివరి షెడ్యూల్ లో కంప్లీట్ చేస్తాం” అని అన్నారు. ఈ చిత్రానికి దీపక్ వేణుగోపాలన్ సంగీతం అందిస్తున్నారు. నరేష్, పవిత్ర లోకేష్, జయప్రకాష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu