HomeTelugu Newsసుకుమార్‌తో రామ్‌ మూవీ!

సుకుమార్‌తో రామ్‌ మూవీ!

14 1
దర్శకుడు సుకుమార్ తాజాగా స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా ఒక సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమాకి సంబంధించిన పనులతోనే ఆయన బిజీగా వున్నాడు. లాక్ డౌన్ ఎత్తేసిన తరువాత ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. కాగా ఈ ప్రాజెక్టు తరువాత సుకుమార్ ఏ హీరోతో సెట్స్ పైకి వెళ్లనున్నాడనేది ఆసక్తికరంగా మారింది.

ఈ నేపథ్యంలోనే ఎనర్జిటిక్‌ హీరో రామ్ పేరు తెరపైకి వచ్చింది. ఇటీవలే రామ్ కి సుకుమార్ ఒక కథ వినిపించడం, కథ ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయిందట. అయితే 2007లో ఈ ఇద్దరి కాంబినేషన్లో ‘జగడం’ సినిమా వచ్చింది. ఈ సినిమా ఆశించినస్థాయిలో ఆడలేదుగానీ, రామ్ కి యూత్ లో మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టింది. మళ్లీ ఇంతకాలానికి ఈ కాంబినేషన్ రీపీట్‌ అవుతోంది. బన్నీ సినిమాను పూర్తిచేసిన తరువాతనే సుకుమార్.. రామ్ సినిమాపై దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu