
దర్శకుడు అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సంక్రాంతి సీజన్లో భారీ విజయాన్ని సాధించారు. ఈ చిత్రంలో కుటుంబ కథతో పాటు హాస్యాన్ని కూడా జోడించడం ప్రేక్షకులను ఆకర్షించింది. సినిమా రూ. 300 కోట్లను వసూలు చేసి, పెద్ద సంచనలను సృష్టించింది. ప్రస్తుతం, ఈ సినిమా రూ. 400 కోట్లకు చేరుకునే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. ఆ తర్వాత, అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవితో కొత్త సినిమా చేయబోతున్నట్లు సమాచారం. చిరంజీవి విశ్వంభర సినిమా పూర్తయ్యాక అనిల్ దర్శకత్వంలో ఒక కొత్త ప్రాజెక్ట్‌కి అంగీకరించినట్లు తెలుస్తోంది.
మరోపక్క..హీరో Ram Pothineni ప్రస్తుతం దర్శకుడు మహేష్ దర్శకత్వంలో ఒక ప్రేమ కథా చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో భాగ్యశ్రీ భోర్సే కథానాయికగా నటిస్తున్నారు. గతంలో రామ్ చేసిన కందిరీగ, మసాలా, పండగ చేస్కో చిత్రాలకు అనిల్ రావిపూడి రచయితగా పనిచేశారు. ఇక ఈ పరిచయంతో వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. అనిల్ అప్పటినుంచి రామ్ తో సినిమాను చేయాలని ఆలోచనలో ఉన్నారంట.
కాగా అనిల్ రావిపూడి తన తొలి సినిమా పటాస్, తర్వాత సుప్రీమ్ వంటి విజయవంతమైన చిత్రాలు తీసిన వెంటనే..రాజా ది గ్రేట్ సినిమాకు కథను సిద్ధం చేశారు. ఈ కథను అప్పట్లో రామ్‌కి వినిపించగా, ఆయన కూర అంగీకరించారు. అన్ని ఏర్పాట్లు కూడా జరిగాయి. అయితే, ఆ సమయంలో రామ్ వరుస క్లాకులు ఎదుర్కొంటున్న తరుణంలో.. అనిల్ తో తన సినిమాలను వాయిదా వేసి, కొంత గ్యాప్ తీసుకునే నిర్ణయం తీసుకున్నాడంట. దీనితో అనిల్ కూడా వాయిదా వేశారు.
ఆ తర్వాత, ఈ కథను అనిల్ రవితేజకి వినిపించగా, ఆయన అంగీకరించి, సినిమా ప్రారంభమైంది. ఈ చిత్రానికి భారీ విజయాన్ని దక్కించుకుంది. అయితే, రామ్‌తో ఈ సినిమా ఎందుకు జరగలేదన్న విషయంపై ఎన్నో కథనాలు వినిపించాయి. కొన్ని వార్తలు, రామ్, అనిల్ మధ్య మనస్పర్థలు ఏర్పడిన కారణంగా ఈ సినిమా వాయిదా పడిందని తెలియజేశాయి.
ఇటీవలి ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి ఈ విషయం పై మాట్లాడినప్పుడు, అనుకోని కొన్ని కారణాల వల్ల రామ్ తో తాను చేయవలసిన సినిమా వాయిదా పడింది అని తెలిపారు. కానీ పూర్తిగా ఈ వివాదంపై.. అలానే తనకు రూమ్ కి మధ్య ఏమన్నా గొడవ జరిగిందా లేదా అన్న విషయం పైన స్పష్టత ఇవ్వలేదు. దీంతో, నెటిజన్లు రామ్ మంచి సినిమా మిస్ చేసుకున్నాడని అభిప్రాయపడుతున్నారు.