బాడీని వి షేప్‌కి మార్చేసిన హీరో రామ్‌

బాలీవుడ్ హీరోలు చొక్కాలు విప్పేసి కండలు ప్రదర్శించడం షరా మామూలే. పాతకాలం నుంచి అక్కడ ఇలాంటి సీన్స్ సినిమాల్లో కనిపిస్తుంటుంది. టాలీవుడ్ కూడా ఇప్పుడు ఇదే రూట్ ను ఫాలో అవుతుండటం విశేషం. పాతతరం హీరోలు పక్కన ఉంచితే… యువ హీరోలు మాత్రం చొక్కాలు విప్పేసి కండలు ప్రదర్శించడం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఈ రూట్ లో రామ్ చరణ్ కూడా చేరిపోయాడు.

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇస్మార్ట్ శంకర్ సినిమాలో రామ్ హీరోగా చేస్తున్నాడు. రామ్ ను ఇప్పటి వరకు ఎవరూ చూపించని విధంగా చూపిస్తున్నారట. ఇందుకోసం రామ్ లైఫ్ స్టైల్ ను గెటప్ ను పూర్తిగా చేంజ్ చేశాడు. బాడీని వి షేప్ కు తీసుకొచ్చాడు. రామ్ వి షేప్ బాడీ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ ఫోటో చూస్తుంటే.. శివమ్ సినిమా కోసం అజయ్ దేవగణ్ వి షేప్ బాడీతో ఎలా ఉన్నాడో ఇంచుమించుగా రామ్ కూడా అలాగే ఉండటం విశేషం.