HomeTelugu Trendingఈ వారం ఎలిమినేట్‌ అయ్యేది అతడే..

ఈ వారం ఎలిమినేట్‌ అయ్యేది అతడే..

Bigg boss 4 telugu first wi
తెలుగు బిగ్‌బాస్-4 గత ఆదివారం అట్టహాసంగా ప్రారంభమై.. తొలి వారం పూర్తి చేసుకుంది. మొద‌టి వారం ఎలిమినేష‌న్ ప్రారంభం అయింది. కాగా ఎలిమినేష‌న్ జోన్‌లో ఉన్న ఏడుగురిలో ఇప్పటికే గంగ‌వ్వ‌, అభిజిత్‌, సుజాత‌ను సేవ్ చేశారు నాగ్‌. మెహ‌బూబ్‌, అఖిల్‌, దివి, సూర్యకిరణ్ డేంజ‌ర్ జోన్‌లోనే ఉన్నారు. అయితే ఇప్ప‌టివ‌ర‌కు అందించిన స‌మాచారం ప్రకారం ద‌ర్శ‌కుడు సూర్య కిరణ్‌ హౌస్ నుంచి బ్యాగు స‌ర్దు‌కుని బ‌య‌ట‌కు వెళ్ల‌నున్నాడ‌ని భోగ‌ట్టా.

కాగా షో స్టార్ట్‌ అయి వారం రోజులు కావ‌స్తున్నా షో ఆసక్తికరంగా లేదు అంటు ప్రేక్ష‌కులు పెద‌వి విరుస్తున్నారు. దీంతో బిగ్‌బాస్ నిర్వాహ‌కులు వైల్డ్ కార్డ్ ఎంట్రీ హౌస్‌ లో ప్రేవేశపెట్టనున్నారు. ఈ మేర‌కు నేటి ఎపిసోడ్‌లో నాగ్‌ ఓ స‌ర్‌ప్రైజ్ ఉండ‌బోతోందని చెప్పారు. ఆ వెంట‌నే ఓ వైల్డ్ కార్డ్ కంటెస్టెంటును లోప‌లికి పంపిచారు. న‌టుడు సాయి కుమార్‌ను లోపలికి పంపినట్లు అని స‌మాచారం. ‘ఈ రోజుల్లో’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న సాయి కుమార్. దీంతో బిగ్‌బాస్ షో ద్వారా త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోనున్నాడు. మ‌రి ఆయ‌న‌కు బిగ్‌బాస్ ఎంత‌మేర‌కు క‌లిసివ‌స్తుందో చూడాలి!

Bigg boss 4 telugu first li

Recent Articles English

Gallery

Recent Articles Telugu