HomeTelugu Trendingసుధీర్‌బాబు కొత్తసినిమా ఫస్ట్‌లుక్‌

సుధీర్‌బాబు కొత్తసినిమా ఫస్ట్‌లుక్‌

Hero sudheer babu new movie

హీరో సుధీర్‌బాబు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్ర‌స్తుతం ఈయ‌న నాలుగు సినిమాల‌ను సెట్స్‌పైన ఉంచాడు. మ‌హేష్ అనే కొత్త ద‌ర్శ‌కుడితో సుధీర్ ఓ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టైటిల్ మోష‌న్ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు.

ఈ చిత్రానికి ‘హంట్: గ‌న్స్ డోంట్ లై’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేస్తూ మోష‌న్ టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. మోష‌న్ టీజ‌ర్‌ తోనే మేక‌ర్స్ సినిమాపై విప‌రీత‌మైన క్యూరియాసిటీని క్రియేట్ చేశారు. సుధీర్ బాబుకు 16వ సినిమాగా ఈ మూవీ తెర‌కెక్కుతుంది. భ‌వ్య క్రియేష‌న్స్ ప‌తాకంపై వి.ఆనంద్ ప్ర‌సాద్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. హీరో శ్రీకాంత్, త‌మిళ న‌టుడు భ‌ర‌త్ కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను జరుపుకుంటుంది. ఇక సుధీర్ న‌టించిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. మొహ‌నకృష్ణ ఇంద్రగంటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంపై ప్రేక్ష‌కుల‌లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. దీనితో పాటుగా ‘మామా మ‌చ్చింద్రా’, పుల్లేల గోపిచంద్ బ‌యోపిక్‌ల‌ను చేస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu